నిజామాబాద్‌లో పోలింగ్ శాతంపై అనుమానాలు..సీఈవోకు అరవింద్ ఫిర్యాదు

నిజామాబాద్‌లో పోలింగ్ శాతం పెరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. తనకు ఉన్న అనుమానాలపై రాష్ట్ర సీఈవో రజత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. 185 మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన ఈ ఎన్నికల్లో.. పోలింగ్ శాతం పెరగడంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఆ మిషన్‌ని మళ్ళీ కౌంట్ చేయాలని కోరారు. ..

Recommended For You