దారుణం: నడిరోడ్డుపై గొడ్డలితో…

జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై మరొకరు గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన సార్గమ్మ వీధిలో చోటుచేసుకుంది. మార్కండేయ వీధికి చెందిన తిప్పర్తి కిషన్‌కు, అనంతారంకు చెందిన లక్ష్మణ్‌ అనే వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయి. ఇదే కోపంతో మాటు వేసిన లక్ష్మణ్‌.. కిషన్‌పై గొడ్డలితో దాడి చేశాడు. గతంలో కూడా ఇతనిపై హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. కిషన్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.

Recommended For You