ఇరు వర్గాల మధ్య ఘర్షణ .. నాటు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ..

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నాటు బాంబు పేలుళ్లు
నాయకుడు తండాలో రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ
ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుని నాటు బాంబులు విసిరిన ఇరు వర్గాలు
నాటు బాంబు పేలుళ్లలో పలు ఇళ్లు ధ్వంసం
నాయకుడు తండాలో 144 సెక్షన్‌
ఎప్పుడు ఏం జరుగుతుందో అని గజగజా వణుకుతున్న గిరిజన ప్రాంతాల ప్రజలు

 

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నాటు బాంబు పేలుళ్లతో దద్గరిల్లింది. తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నాయకుడు తండాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర స్థాయికి చేరుకుని నాటు బాంబులు విసరడంతో పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో 144 సెక్షన్‌ విధించారు పోలీసులు.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని గిరిజన ప్రాంతాల ప్రజలు గజగజా వణుకుతున్నారు.

Recommended For You