ఆ 32 స్థానాల్లో గులాబీ జెండానే ఎగరాలి: కేసీఆర్

32 ZP స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. TRS ఆఫీస్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి, పెద్దపల్లి అభ్యర్థిగా పుట్టా మదు పేర్లు ఖరారు చేశారు. మిగతాచోట్ల అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తున్నట్టు మరోసారి ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగ‌ర‌వేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ విస్త్రతస్థాయి సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో 32 జెడ్పీ చైర్మన్‌లను కైవసం చేసుకోనే దిశ‌గా కేసీఆర్ పార్టీనేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరు, పెద్దపల్లికి పుట్ట మధు పేర్లను కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఓడిపోయిన ఎమ్మెల్యేలకు జడ్పీ చైర్మన్ లుగా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇతర అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించారు.

లోక్‌సభ ఎన్నికల్లో 16 కు 16 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్‌ చెప్పి కేడర్‌లో జోష్‌ నింపారు. వచ్చే రోజుల్లో ఢిల్లీలో చక్రం తిప్పేది మనమే అని స్పష్టం చేశారు. మరోవైపు.. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై సుదీర్ఘ వివరణ ఇచ్చిన కేసీఆర్.. ఈ విషయంలో ముందుకు వెళ్లాల్సిందే అన్నారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలను పూర్తి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో 535 జెడ్పీటీసీ, 5 వేల 857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జరుగుతాయి. అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చ‌ర్చించారు. ఈ పరిషత్‌ ఎన్నికల గెలుపు బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రధాన కార్యదర్శులకు కేసీఆర్‌ అప్పగించారు.

స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగ‌ర‌వేయడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్‌ విస్త్రతస్థాయి సమావేశంలో.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ కీల‌క కార్యవ‌ర్గం పాల్గొంది. రాష్ట్రంలో 32 జెడ్పీ చైర్మన్‌లను కైవసం చేసుకోనే దిశ‌గా కేసీఆర్ పార్టీనేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో 535 జెడ్పీటీసీ స్థానాలకు, 5 వేల 857 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిక‌లు పార్టీ గుర్తుల‌పై జరుగుతాయి. ఈ నేపథ్యంలో.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో విస్తృతంగా చ‌ర్చించారు. పరిషత్‌ ఎన్నికల గెలుపు బాధ్యతను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అప్పగించారు.

Recommended For You