పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. మూడు గుడిసెలు దగ్ధం

*వరంగల్‌ రూరల్‌ జిల్లా హాట్యూతండాలో అగ్నిప్రమాదం
*విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో పేలిన గ్యాస్‌ సిలిండర్‌
*చెలరేగిన మంటలు, మూడు గుడిసెలు దగ్ధం
*సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం

వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం హాట్యూ తండాలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో మూడు గుడిసెలు కాలి బూడిదయ్యాయి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగి సిలిండర్‌కు అంటుకున్నాయి. అది కాస్తా పేలడంతో మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు విశ్వప్రయత్నం చేశారు. సుమారు 15 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Recommended For You