యోగి ఆదిత్యనాథ్, మాయావతిలపై ఈసీ నిషేధం

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా… ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఎలక్షన్‌ కమిషన్‌కు తక్కువ అధికారాలు ఉన్నాయనడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయ స్థానం… రేపు తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని సీఈసీని ఆదేశించింది. ఈ సందర్భంగా మాయావతి, యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించింది సుప్రీం కోర్టు. నాయ్యస్థానం ఆవేశాలపై  స్పందించిన ఈసీ యోగి ఆదిత్యనాథ్, మాయావతిల ప్రచారంపై తాత్కలిక నిషేదం విధించింది. మాయావతి ప్రచారంపై 48 గంటలు,యోగి ఆదిత్యానాథ్ ప్రచారం పై 72 గంటల పాటు నిషేధం విధుస్తున్నట్లు తెలిపింది.

Recommended For You