మండలిలో మంత్రి యనమల రామకృష్ణుడు ప్రమాణ స్వీకారం

ఏపీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ యనమల చేత ప్రమాణం చేయించారు. మండలి సభ్యుడిగా రెండో సారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు యనమల. ఈవీఎంల మీద తమకు ఎప్పటి నుంచో అభ్యంతరాలు ఉన్నాయని.. రెండు శాతం మాత్రమే వీవీ ప్యాట్లను లెక్కిస్తామని ఈసీ అనడం సరికాదన్నారు యనమల.

ఇటు తెలంగాణలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎనిమిది మంది ఎమ్మెల్సీల చేత మండలి ఇన్‌చార్జ్‌ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రమాణం చేయించారు. శాసన సభ్యుల కోటా కింద ఎన్నికైన మంత్రి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యెగ్గె మల్లేశం, ఎంఐఎంనుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి.. కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్‌ – మెదక్‌ – నిజామాబాద్‌ – ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన జీవన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

Recommended For You