ట్రైన్‌లో ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి..

*సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
*ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి చోరీ
*15వేల నగదు, 4 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లిన దుండగులు
*కాజీపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు
*అస్వస్థతకు గురైన ప్రయాణికులకు ఎంజీఎంలో చికిత్స

యశ్వంత్‌పూర్‌- ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు దోచుకున్నారు. ఈ చోరీపై కాజీపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు .. మత్తు మందు ఎఫెక్ట్‌తో అస్వస్థతకు గురైన వారిని వరంగల్ MGM ఆస్పత్రికి తరలించారు.

బెంగళూరు నుంచి బయలుదేరే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ మీదుగా హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తుంది. ఐతే.. ప్రయాణికులకు ధర్మవరం దాటాక మత్తుమందు ఇచ్చి వీళ్లను దొంగలు దోచుకున్నారు. కాస్త తెలివి వచ్చాక.. దోపిడీపై కాజీపేటలో ఫిర్యాదు చేశారు. 15 వేల నగదు, 4 సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్టు చెప్తున్నారు.

Recommended For You