రామ్ చరణ్, ఉపాసన ఇండస్ట్రీలో అందరినీ.. : సమంత కామెంట్స్

మజిలీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోంది సామ్. విడుదలైన వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి భారీ విజయం సాధించింది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సమంత రామ్ చరణ్ భార్య నడిపే ‘ బి పాజిటివ్ – హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ ‘అనే హెల్త్ మ్యాగజైన్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇండస్ట్రీలో ఎవరు విజయం సాధించినా మనస్ఫూర్తిగా అభినందించే వ్యక్తి రాంచరణ్ ఒక్కడేనేమో అని చెర్రీని పొగిడేస్తోంది.

 

మంచి ఫాంలో ఉన్న ఒక ఆర్టిస్ట్ తోటి నటుల నటనను, సినిమాలను మెచ్చుకుంటూ అవి హిట్టైతే పుష్పగుచ్చం పంపించి మరీ అభినందనలు తెలియజేస్తుంటారు. ఇలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదంటోంది. తాజాగా మజిలీ సినిమాను మెచ్చుకుంటూ రాంచరణ్.. సామ్, చైతూల ఇంటికి ప్లవర్‌బొకే పంపించారట. ఇంతకు ముందు శ్రీమంతుడు సక్సెస్‌ని చూసి మహేష్‌కి, అరవింద సమేతుడుని మెచ్చి ఎన్టీఆర్‌కి పుష్పగుచ్చాలు పంపించారట.

 

ఇండస్ట్రీలోని అందరినీ ఒక్కటి చేయడానికి రామ్ చరణ్, ఉపాసనలు ట్రై చేస్తున్నారు. అందరిలో స్నేహభావాన్ని పెంచుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు అని సమంత వ్యాఖ్యానించింది. రంగస్థలం సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు వినమ్రంగా నమస్కరించిన రాంచరణ్.. వినయ విధేయ రామ డిజాస్టర్‌ని అంతే వినయంగా ఒప్పుకుని అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం చెర్రీ, ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Recommended For You