సొంత గడ్డపై సన్‌రైజర్స్‌ ఓటమి

సొంత గడ్డపై హైదరాబాద్‌ సన్‌ రైజర్స్‌కు ఓటములు తప్పడం లేదు. ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఘోరంగా ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. పృథ్వీషా 4, శిఖర్‌ధావన్‌ 7 త్వరగా ఔటైనా కొలిన్‌ మన్రో 40 రన్స్‌, శ్రేయస్‌ అయ్యర్‌ 45 పరుగులు చేసి ఆదుకున్నారు. చివరిలో శ్రేయస్‌ అయ్యర్‌‌, రిషభ్‌పంత్‌లు నిలకడగా ఆడడంతో ఢిల్లీ 155 పరుగులు చేసింది.

156 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన సన్‌ రైజర్స్‌ మొదట గెలుపువైపు నడుస్తున్నట్టు కనిపించింది. 15 ఓవర్లకు 100/2తో పటిష్ఠస్థితిలో నిలిచి ఢిల్లీని భయపెట్టింది. అయితే ఊహించని రీతిలో మరో 3.5 ఓవర్లలో 16 పరుగులే చేసి చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ 51 రన్స్‌, బెయిర్‌స్టో 41 పరుగులు తప్పా అంతా ఫెయిలయ్యారు. దీంతో 39 పరుగుల తేడాతో ఘోర ఓటమిపాలైంది.

Recommended For You