పసిబిడ్డతో ధర్నాకు దిగిన తిరుమలనాయుడు భార్య

నెల్లూరు వైసీపీ రూరల్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిన్న దుండగుల దాడిలో తీవ్ర గాయాలకు గురైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు భార్య.. వైసీపీ కార్యాలయం వద్ద పసిబిడ్డతో వచ్చి బైఠాయించింది. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని కన్నీరుమున్నీరైంది. భారీగా మోహరించిన పోలీసులు తిరుమల భార్యతో పాటు బంధువులను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు.

పక్కా ప్లాన్‌తో తిరుమల నాయుడుపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం రామ్మూర్తి నగర్, మహాలక్ష్మమ్మ గుడి దగ్గర బైక్‌పై వెళ్తున్న సమయంలో ఇన్నోవాతో అడ్డగించి.. దాడి చేశారు దుండగులు. అరుపులు కేకలు విని స్థానికులు అటుగా రావడంతో దుండగులు పారిపోయారు. ఈ ఘటనతో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీలు చించేశారు.

Recommended For You