నెల్లూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కాల్చివేసిన అధికారులు..కలెక్టర్‌ సీరియస్‌

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం
హైస్కూల్‌ ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు
పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు
స్లిప్‌లను స్వాధీనం చేసుకుని కాల్చివేసిన రెవెన్యూ అధికారులు
వీవీ ప్యాట్ స్లిప్‌లు బయటకు రావడంపై కలెక్టర్‌ సీరియస్‌
విచారణకు ఆదేశించిన కలెక్టర్ ముత్యాల రాజు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీ ప్యాట్‌ స్లిప్‌ల కలకలం రేగింది. ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో వీవీ ప్యాట్‌ స్లిప్‌లు దర్శనమిచ్చాయి.పాఠశాల ఆవరణలో 133, 134 బూత్‌లకు చెందిన వీవీ ప్యాట్‌ స్లిప్‌లు కన్పించడంతో స్థానికులు విస్తుపోయారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.. ఆ స్లిప్‌లను స్వాధీనం చేసుకుని.. కాల్చివేశారు. వీవీ ప్యాట్ స్లిప్‌లు బయటకు రావడంపై జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

Recommended For You