దారుణం: 22 ఏళ్ళ కూతురిని తల్లి ముందే..

స్వతంత్ర భారతంలో అత్యాచార పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి. కన్న తల్లి ముందే ఇద్దరు రేపిస్ట్‌లు కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన సంఘటన  ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్‌ జిల్లా కాక్రౌలికు చెందిన 22 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి మందులు కొనడానికి బయటకు వచ్చింది. వారు మందులు కొనే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి వారిని బంధించి పక్కన ఉన్న చెరకు తోటకు తీసుకెళ్లారు. తోటలోనే తల్లిని బంధించి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. ఇంటికి వచ్చిన తల్లి, కూతురు.. ఆ దారుణానికి సంబంధించిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Recommended For You