ముందు ముద్దన్నాడు.. తరువాత..

తన కోసం బస్టాప్‌లో వెయిట్ చేయడం.. కనిపించేంత వరకు టాటా చెప్పడం.. అన్నం తిన్నావా అని ఆరా తీయడం.. త్వరగా పడుకో లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అని జాగ్రత్తలు చెప్పడం.. ఇవన్నీ భలే నచ్చేస్తుంటాయి.. ప్రేమించుకుంటున్న అమ్మాయిలు అబ్బాయిలకు. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి అసలు స్వరూపం బైట పడిన తరువాత అమ్మానాన్నకు జరిగిన సంగతి చెబుతారు.

తాజాగా చెన్నై ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న రష్మీకి తనతో పాటే చదువుతున్న శ్రీనాథ్ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ పరిచయమే వారిని స్నేహితులుగా మార్చింది. ఓ రోజు స్నేహితులంతా కలిసి మహాబలిపురం వెళ్లారు. అక్కడ రష్మీతో శ్రీనాథ్ సెల్ఫీ దిగాడు. ఆ తరువాత ఫొటోని ఇంటర్నెట్‌లో పెట్టి ఇద్దరి మధ్యా ఎఫైర్ ఉందని, పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని ప్రచారం చేస్తానని బెదిరించాడు. దాంతో రష్మీ బెదిరిపోయింది.

ఇదే అదనుగా భావించిన శ్రీనాథ్ నాకో కిస్ ఇస్తే ఆ ఫోటోలను నీముందే డిలీట్ చేస్తానన్నాడు. చేసేదేం లేక సరేనంటూ ఒప్పుకుంది రష్మీ. ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి రష్మీకి ముద్దిచ్చాడు శ్రీనాథ్. ఆమె కళ్ల ముందే తనతో దిగిన సెల్ఫీని డిలీట్ చేశాడు. కానీ రష్మీకి తెలుసుకోలేకపోయింది. శ్రీనాథ్ మరో మోసానికి స్కెచ్ గీసాడని. రెండు రోజుల తరువాత రష్మీని మళ్లీ కలిసిన శ్రీనాథ్ తనతో గడపడానికి రమ్మన్నాడు. ఆ మాటలకు షాకైన రష్మీ.. ఛీ దుర్మార్గుడా అని అసహ్యించుకుంది.

దాంతో రివర్సైన శ్రీనాథ్ ముద్దిచ్చినప్పుడు తన ఫ్రెండ్ తీసిన ఫోటోని, అంతకు ముందు దిగిన సెల్ఫీని చూపించాడు. డిలీట్ చేయడానికి ముందే మరోచోట సేవ్ చేసి పెట్టుకున్నానన్నాడు. ఇప్పుడు ఒకటికి తోడు రెండు ఫోటోలు తనదగ్గర ఉన్నాయన్నాడు. తనని కాదంటే పరువు బజారుకు ఈడుస్తానన్నాడు.

ఇలాగే అతడు చెప్పినట్టల్లా వింటే ఇంకెంత బ్లాక్ మెయిల్ చేసి జీవితాన్ని నాశనం చేస్తాడో అని భయపడిపోయిన రష్మీ అమ్మానాన్నలకు విషయాన్ని తెలిపింది. వారు పోలీసుల సహాయం కోరారు. విచారణ అనంతరం పోలీసులు శ్రీనాథ్‌ని అరెస్టు చేసి జైలుకి పంపారు.

Recommended For You