వారి లక్ష్యంగానే టీడీపీ శ్రేణుల దాడులు..ఈవీఎంలకు..

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసిన వైసీపీ నాయకులు
వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని…
ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు
దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన వైసీపీ
స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలకు భద్రత పెంచాలని కోరిన వైసీపీ

 

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవా లని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ప్రభాకర్ రెడ్డి, బుట్టా రేణుక, అవంతి శ్రీనివాస్‌లతో కూడిన బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైంది. ఏపీలో వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. అలాగే, స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలకు భద్రత పెంచడంపై దృష్టి సారించాలని కోరారు.

Recommended For You