మరో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షాన్దేంగ్ ప్రావిన్స్‌లోని జినాన్‌ సిటీలో ఉన్న ఓ ఫార్మా కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు.

ఇటీవలి కాలంలో చైనాలోని కర్మాగారాల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతు న్నాయి. గత 2 నెలల్లో 4 భారీ ప్రమా దాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 31న జివాంగ్‌సూ ప్రావిన్స్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 30న షాన్దేంగ్‌లోని కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మార్చి 22న చైనాలో అతి ఘోరమైన ప్రమాదం జరిగింది. యాంచెంగ్‌లోని పారిశ్రామిక వాడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 78 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 600 మందికి గాయాలయ్యాయి.

వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ వ్యాప్తంగా రసాయన కర్మాగారాల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Recommended For You