రాజకీయ కక్షలు.. పెళ్లి విందులో నాటు బాంబులతో దాడులు..

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నాటు బాంబు పేలుళ్లతో దద్గరిల్లింది. తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నాయకుడు తండాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు నాటు బాంబులతో దాడులకు పాల్పడ్డారు.

ఒకరిపై ఒకరు బాంబులు విసరడంతో 20కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొన్నిరోజులుగా రగులుతున్న రాజకీయ కక్షలే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో 144 సెక్షన్‌ విధించారు పోలీసులు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజన ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్ధి కొండానాయక్‌… టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి సక్కూ నాయక్‌పై విజయం సాధించారు. అప్పటి నుంచి గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు. పెళ్లి విందులో.. మరోసారి ఈ రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో పరస్పరం నాటు బాంబులతో దాడులు చేసుకున్నారు. దీంతో అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి.

Recommended For You