కర్ణాటకలో మళ్లీ ఐటీ దాడుల కలకలం

కర్ణాటకలో మళ్లీ ఐటీ దాడుల కలకలం చోటు చేసుకుంది. ఆదాయపు పన్నుశాఖ అధికారులో మరోసారి కన్నడనాట సోదాలు చేపట్టారు. మాండ్య, హసన్‌లలో ఐటీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామునే రంగంలోకి దిగిన ఐటీ అధికారులు, పలువురి ఇళ్లను సోదా చేశారు.

ఇటీవలి కాలంలో కర్ణాటకలో ఐటీ సోదాలు సర్వసాధారణమయ్యాయి. ఎన్నికల వేళ ఐటీ దాడుల జోరు పెరిగింది. కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్, జేడీఎస్ నేతలు, వారి బంధువులు, అనుచరుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. మంత్రి పుట్టరాజు ఇళ్లు, ఆఫీసులను తనిఖీ చేశారు. సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణకు సంబంధించిన మంత్రిత్వ శాఖ లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

Recommended For You