పెళ్లికి అంగీకరించడం లేదని.. ఓ ప్రేమ జంట..

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని.. ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మొరవపల్లికి చెందిన ధనుంజయ, శ్రీకాళహస్తికి చెందిన పల్లవిలు ఏడాది నుంచి ప్రేమించుకుంటున్నారు. ధనుంజయ స్థానికంగా జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం వీరు తమ ప్రేమను తల్లి దండ్రులకు తెలియజేసి.. వివాహం చేయమని అడిగారు. అయితే పెద్దలు వీరి అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఇవాళ తెల్లవారుజామున మొరవపల్లి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

Recommended For You