మోదీ బయోపిక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయోపిక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మోదీ బయోపిక్‌ను పూర్తిగా చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సినిమా పూర్తిగా చూడకుండా నిర్ణయం తీసుకోవడం సరి కాదని హితవు పలికింది. మోదీ జీవితకథ ఆధారంగా పీఎం నరేంద్రమోదీ సినిమా తెరకెక్కింది. మోదీ పాత్రలో ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. ఐతే, సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీ సినిమా విడుదల చేస్తున్నారని ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్లపై పీఎం నరేంద్రమోదీ సినిమా ప్రభావం చూపే అవకాశముందని ఆరోపించాయి. విపక్షాల ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం, మోదీ బయోపిక్‌ విడుదలను ఆపేసింది. ఎన్నికలు ముగిసే వరకు సినిమాను విడుదల చేయవద్దని ఆదేశించింది. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లగా, సినిమా మొత్తం చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

Recommended For You