అర్థరాత్రి హైడ్రామా.. కార్యకర్తను విడుదల చేయాలంటూ..

శంషాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో అర్థరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తమ అనుచరుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ… పాలమాకుల గ్రామ సర్పంచ్‌ సుష్మ.. తెల్లవారుజాము వరకు ఆందోళన చేసింది. ఆదివారం జరిగిన గ్రామ సభలో… మంచినీటి సమస్యపై టీఆర్‌ఎస్‌ వార్డు సభ్యుడు సునీల్‌ వాగ్వాదానికి దిగాడు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తంది. ఈ గొడవలో సునీల్‌కు గాయమైంది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలో దిగిన పోలీసులు.. సర్పంచ్‌ అనుచరుడు మల్లేష్‌ను అరెస్ట్‌ చేశారు.

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్‌ సుష్మ.. ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ఒత్తిడి వల్లే పోలీసులు.. తప్పుడు కేసు బనాయించారంటూ ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తలతో కలసి తెల్లవారుజాము వరకు పీఎస్‌ ముందు బైఠాయించారు. తమ కార్యకర్తను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అయితే.. పోలీసులు మాత్రం తాము చట్టప్రకారమే చర్యలు తీసుకున్నామంటున్నారు.

Recommended For You