మార్కెట్లోకి కొత్త హెల్మెట్.. ఫీచర్లెన్నో..

హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే రక్షణ. అది సరే మరి కాల్స్ వస్తే మాట్లాడడం కష్టమవుతుంది. అంత దూరం డ్రైవ్ చేయాలంటే బోర్. వీటన్నింటికీ చెక్ పెట్టేస్తూ హెల్మెట్‌కే బ్లూటూత్ ఏర్పాటు చేసింది వేగ అనే సంస్థ. ఇవో బీటీ పేరుతో కొత్త హెల్మెట్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.2,996.

ఇతర హెల్మెట్ల మాదిరి కాకుండా ఈ హెల్మెట్లో చాలా ప్రత్యేకతలున్నాయి. బ్లూటూత్ సదుపాయం ఉండడంతో కాల్స్ మాట్లాడుకోవచ్చు. పాటలు వినొచ్చు. వాయిస్ అసిస్టెడ్ నావిగేషన్ ఫీచర్ ఉంది. ఆటోమేటిక్ కాల్ ఆన్సరింగ్ ఫీచర్ వలన ఫోన్ బటన్ కూడా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరక్ట్‌గా కాల్స్ మాట్లాడుకోవచ్చు.

ఇంకా ఇది ఐఎస్‌ఐ సర్టిఫైడ్ గుర్తింపుని కలిగి ఉంది. మీడియం, లార్జ్ సైజుల్లో అందుబాటులో ఉంది. హెల్మెట్‌లోనే బ్యాటరీ కూడా ఉండడంతో చార్జింగ్ పెట్టుకోవచ్చు. చార్జింగ్ ఎంత ఉందో స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌పై చూడొచ్చు.
హెల్మెట్ ప్రత్యేకతలు ఓ సారి చూస్తే..
మ్యూజిక్ వినొచ్చు
కాల్స్ మాట్లాడుకోవచ్చు
హ్యాండ్స్‌ఫ్రీ ఫంక్షన్
బిల్ట్‌ఇన్ రీచార్జబుల్ లి-అయాన్ బ్యాటరీ
సీఎస్‌ఆర్ బ్లూటూత్ చిప్
స్మార్ట్‌ఫోన్లపై పవర్ డిస్‌ప్లే
హైడెఫినేషన్ స్పీకర్లు

Recommended For You