లవ్వంటూ వెంట పడింది.. స్టూడెంట్‌తో నాకే సంబంధం లేదు.. – లెక్చరర్‌

విశాఖలో బీటెక్‌ యువతి అనుమానాస్పద మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే క్లూస్‌టీమ్‌.. ఫింగర్ ప్రింట్స్ సహా మరికొన్ని ఆధారాలు సేకరించింది. లెక్చరర్ అంకుర్‌తోపాటు అతని రూమ్‌మేట్‌ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జోత్స్న డెడ్‌బాడీకి కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం చేస్తున్నారు. ఆ తర్వాత పేరెంట్స్‌కు అప్పగించనున్నారు. ఇది ఆత్మహత్యా..? హత్యా..? అనేది త్వరలోనే ఛేదిస్తామంటున్నారు.

జోత్స్న ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని తల్లి మారతి అంటున్నారు. కూతుర్ని కోల్పోయిన బాధలో ఆమె గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జోత్స్న చాలా తెలివైన అమ్మాయని.. తన జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోతుదంని అనుకోలేదని కన్నీరుపెడుతున్నారు. అటు, జోత్స్న కుటుంబానికి మహిళా సంఘాలు అండగా నిలిచాయి. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మల్కాపురం జయేంద్రకాలనీకి చెందిన జ్యోత్స్న ప్రస్తుతం బుల్లయ్య కళాశాలలో బీటెక్‌ ఫస్టియర్ చదువుతోంది. నిన్న కాలేజ్‌కి వెళ్లేందుకు తండ్రి దేవకర్‌ ఆమెను బస్‌స్టాప్‌లో దించారు. ఐతే.. జోత్స్న కాలేజీకి వెళ్లకుండా అక్కడి నుంచి శాంతిపురంలోని కట్టా ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న అంకుర్ ఫ్లాట్‌కి వచ్చింది. గతంలో ద్వారకానగర్‌లో IIT కోచింగ్ తీసుకునే సమయంలో లెక్చరర్‌ అంకుర్‌తో జోత్స్నకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పలుమార్లు అతని ప్లాట్‌కు కూడా వెళ్లింది. ఐతే.. డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసమే ఆమె వచ్చేదా.. లేదంటే ఇద్దరి మధ్య వేరే స్నేహం ఉందా అనే దానిపై క్లారిటీ లేదు. తీరా ఇప్పుడు అంకుర్‌ ఫ్లాట్‌లోనే జోత్స్న ఉరి వేసుకుని చనిపోవడం కలకలం రేపింది.

Recommended For You