ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ లేఖ రాస్తే సరి : కన్నా లక్ష్మీనారాయణ

సీఎం జగన్ లేఖ రాస్తే సరి : కన్నా లక్ష్మీనారాయణ
X

పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖరాస్తే తప్పకుండా తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మోదీ ఐదేళ్ల కృషి ఫలితంగానే బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చిందన్నారు. PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందన్నారు. సైనికుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం మోదీ పరిపాలనా దక్షతకు నిదర్శనమని కన్నా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి గెలిచేందుకు కృషి చేస్తామన్నారు.

Next Story

RELATED STORIES