11 Jun 2019 2:19 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / బిల్డింగ్‌పై కూలిపోయిన...

బిల్డింగ్‌పై కూలిపోయిన హెలికాప్టర్

బిల్డింగ్‌పై కూలిపోయిన హెలికాప్టర్
X

అమెరిలోని న్యూయార్క్ లో ఓ హెలికాప్టర్ కూలిపోయింది. మాన్ హట్టన్ లో భారీ అంతస్థు బిల్డింగ్ పై ఒక్కసారిగా పెద్ద శబ్దంతో హెలికాప్టర్ కూలిపోవడంతో భవనంలోని వారితోపాటు చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో పైలెట్ మరణించినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ పడటంతో భవనం మొత్తం కంపించిందని అందులో నివసిస్తున్నవారు తెలిపారు. అనంతరం చెలరేగిర మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేశారు.

2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను విమానాలతో ఉగ్రవాదులు పేల్చినట్లుగానే.. ఈ దాడి జరిగిందని జనం ఆందోళన చెందారు. హెలికాప్టర్ కూలిపోయిన ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం లేదని, వాతావరణం అనుకూలించక పడిపోయిందని అధికారులు ప్రకటించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ప్రఖ్యాత టైమ్ స్వేర్ సెంటర్ సమీపంలోనే ఈ ఘటన జరిగింది.

Next Story