ఆంధ్రప్రదేశ్

తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత దాడి.. బైక్‌పై వెళ్తున్న వారిని..

తిరుమల ఘాట్‌ రోడ్డులో చిరుత దాడి.. బైక్‌పై వెళ్తున్న వారిని..
X

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో మరోసారి చిరుత దాడి కలకలం రేపింది. రాత్రి పదిన్నర సమయంలో బైక్‌పై వెళ్తున్న వారిపై విరుచుకుపడింది. 9వ కిలోమీటరు వద్ద బైక్‌పై వెళ్తున్న తండ్రీకూతుళ్లపై దాడికి తెగబడింది. పావని అనే చిన్నారి కళ్లపై గోర్లతో గాయపరిచింది. మరో పది నిమిషాలకు అటుగా వెళ్తున్న భార్యాభర్తలపై మళ్లీ దాడికి దిగింది. ఈ ఘటనలో యామిని అనే యువతి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడ్డవారిద్దరినీ అశ్విని ఆస్పత్రికి తరలించారు. అంతటితో ఆగని చిరుత.. ఘాట్‌ రోడ్డులో మళ్లీ కార్లను వెంబడించడం మొదలు పెట్టింది. దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో పలువురు భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. TTD అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Next Story

RELATED STORIES