కొండకు వెళ్లిన ఇద్దరు ప్రేమికులను బెదిరించి..

కొండకు వెళ్లిన ఇద్దరు ప్రేమికులను బెదిరించి..

చిత్తూరు జిల్లాలో దారి దోపిడి దొంగలు ప్రేమికులపై దాడి చేశారు. నాలుగు గ్రాముల బంగారం, ఐదు వేల రుపాయల ఎత్తుకెళ్లారు. స్థానికుల సహాయంతో ప్రేమికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం వద్ద వెలిసిన పార్వతమ్మ కొండకు ఇద్దరు ప్రేమికులు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారిని ముగ్గురు వెంబడించారు. ప్రేమికులపై దాడి చేసి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కొండ దిగి వచ్చిన ప్రేమికులు స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు. వారు కాపు కాచి ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, రిమాండ్‌ కు తరలించారు.

Tags

Next Story