ఆంధ్రప్రదేశ్

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోండి: లోకేశ్

టీడీపీ నేతలపై వరుస దాడులు చేస్తున్నారు వైసీపీ నేతలు. కర్నూలు జిల్లాలో ఆ పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు. జిల్లాలోని. గొరవిమాను పల్లెలో టీడీపీ నేత మైనింగ్‌ ఓనర్‌ రామేశ్వర రెడ్డి వాహనంపై రాళ్ల దాడి చేశారు. దీంతో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. .

ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులు ఆగడం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో మరోసారి రెచ్చిపోయారు వైసీపీ కార్యకర్తలు. కొలిమిగుండ్ల మండలం గొరవిమాను పల్లెలో టీడీపీ నేత మైనింగ్‌ ఓనర్‌ రామేశ్వర రెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేశారు. బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళుతుండగా రామేశ్వర్ రెడ్డి వాహనానికి మరో వాహనాన్ని అడ్డుపెట్టి ఆపారు. విషయం గ్రహించేలోపే రామేశ్వర్ రెడ్డి అతని అనుచరులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు వైసీపీ నేతలు.

ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రామేశ్వరెడ్డి వాహనాలు ధ్వంసమయ్యాయి. జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు పెరిగాయి. మొన్నటికి మొన్న అవుకు, కోవెలకుంట్ల మండలాల్లో టీడీపీ వర్గీయులపై దాడి చేసి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు మరోసారి టీడీపి నేతపై దాడికి దిగారు. దాడి తర్వాత గొరవిమాను పల్లెలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. టీడీపీ వర్గీయులపై కొనసాగుతున్న దాడులపై బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ.... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు.... వైసీపీ కార్యకర్తల దాడులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా ఫైర్‌ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామసర్పంచ్‌ అడ్డాల రాముపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారంటూ ట్వీట్‌ చేశారు. జగన్‌గారూ ఈ దాడులను ఖండించడానికి మీకు మనసురావడంలేదా అని ప్రశ్నించారు. లేదా మీ వాళ్లను అదుపుచేయలేని అమసర్థతతో ఉన్నారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గుర్తుంచుకోండంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Next Story

RELATED STORIES