అధికారపార్టీ నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

అధికార పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు చంద్రబాబు. సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేసి.. కక్ష సాధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీపడి ఇసుక దోచేస్తున్నారని, పరస్పరం కేసులు కూడా పెట్టుకుంటున్నారని అన్నారు. ఇసుక కొరతతో రాజధాని పనులు ఆగిపోయాయని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా.. సభలో ప్రస్తావించే అంశాలపై చర్చించారు. ప్రభుత్వంపై పోరాటం కొనసాగించాలని అన్నారు. అటు, విద్యుత్ PPAల రద్దు వార్తలపైనా చంద్రబాబు స్పందించారు. జగన్‌ తన విద్యుత్ కంపెనీలకు నష్టం రాకూడదని అనుకుంటారని, ఇతరుల కంపెనీలు నష్టాలలో మునిగిపోవాలని కోరుకుంటారని విమర్శించారు.

Tags

Next Story