వ్యవస్థలను కుప్పకూల్చి మాపై బురద చల్లుతున్నారు : చంద్రబాబు
తనపై బురద చల్లాలి అని చూస్తే ముఖ్యమంత్రి జగన్‌నే చులకన అవుతారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వ్యవస్థలను కుప్పకూల్చి తిరిగి తమపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్య విలువలు తెలియని.. ఇంకా తప్పుడు పనులు చేస్తే సీఎం చులకన అవుతారని మండిపడ్డారు.. సీఎం సొంత సంస్థ అయిన సండూర్ పవర్‌పై అసెంబ్లీలో అడిగినా జగన్ నోరు మెదపలేదని విమర్శించారు.
పోలవరంలో 71శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. వైఎస్ 25వేల కోట్ల భారం వేసి వెళ్లారని అన్నారు. కరెంట్ ఛార్జీలు పెంచను.. అవసరం అయితే తగ్గిస్తామని చెప్పి పనిచేశామన్నారు. సీఎం జగన్‌కు దమ్ము ఉంటే ఆ పని ముందు చేయాలన్నారు చంద్రబాబు. పీపీఏలపై సీఎం జగన్ సభలో తప్పుడు సమాచారం ఇచ్చారు. సీఎం చెప్పేది అంత పులివెందుల పంచాయతీ అని విశ్వసనీయతలే ప్రభుత్వమని విమర్శించారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com