మానవత్వం పరిమళించే.. అనాథను దత్తత తీసుకున్న కలెక్టర్
BY TV5 Telugu22 July 2019 7:38 AM GMT

X
TV5 Telugu22 July 2019 7:38 AM GMT
అవకాశం ఉన్నా ఆదుకునే మనసు అందరికీ ఉండదు. అందుకు నేను మినహాయింపుని అంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. మంచి మనసుతో అనాథ బిడ్డను దత్తత తీసుకున్నారు. అమ్మానాన్న లేక ఆర్ఫన్ హోమ్‌లో ఉన్న పిల్లవాడి గురించి తెలుసుకుని తన ఇంటికి తీసుకువెళ్లారు. ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణ ఈనెల 19న గుంతకల్లు మండలం పాత కొత్త చెరువు గ్రామంలో పర్యటించారు. అక్కడ ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ క్రమంలో హాస్టల్లో ఉంటున్న వడ్డే నరసింహులు అనే విద్యార్థి గురించి తెలుసుకుని కలెక్టర్ చలించిపోయారు. ఇకపై బాలుడి బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని.. అనంత ఆణిముత్యాలు పథకం ద్వారా విద్యార్థికి చదువు పూర్తయ్యే వరకు సాయం చేస్తానని ప్రకటించారు.
Next Story