ఆంధ్రప్రదేశ్

మరో దుర్వార్త.. రెండేళ్ళ బాలుడు కిడ్నాప్..

మరో దుర్వార్త.. రెండేళ్ళ బాలుడు కిడ్నాప్..
X

32 రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన తమ బిడ్డ ఆచూకీ తెలపాలంటూ ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ముండ్లమూరు మండలం రెడ్డినగర్ కు చెందిన అశోక్ రెడ్డి దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఇంటి వద్దే అడుకుంటూ ఉన్న తమ రెండేళ్ళ బిడ్డ ఆరుష్ రెడ్డి గత నెల 24వ తేదీ కిడ్నాప్ గురయ్యాడని ఆరుష్ రెడ్డి తండ్రి అశోక్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకూ తమ బిడ్డ ఆచూకీ తెలియ లేదని ఆందోళన చెందుతున్నారు.

గత నెల రోజుల నుండి పోలీసుల నుండి ఎటువంటి సమాచారం లేదని, పైగా తమనే మీ మధ్య ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ విచారణ చేపడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కిడ్నాప్ గురైన బాలుడ్ని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు అత్యంత చాకచాక్యంగా బయటకు తీసుకు వచ్చారని, ప్రకాశం జిల్లా పోలీసులు మాత్రం ఇప్పటి వరకూ తమ బిడ్డ ఆచూకీ కనుక్కోలేక పోయారని ఆరోపించారు. తక్షణమే తమ బిడ్డ ఆచూకీ కనుక్కోవాలంటూ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. ఒక తల్లి కడుపుకోతను అర్దం చేసుకుని పోలీసులు వ్యవహరించాలని బిడ్డ తల్లి జ్యోతి కన్నీటి పర్యంతం అయ్యారు.

Next Story

RELATED STORIES