సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది : నారా లోకేష్
BY TV5 Telugu8 Aug 2019 1:36 PM GMT

X
TV5 Telugu8 Aug 2019 1:36 PM GMT
గోదావరి ఉగ్రరూపం ధరించి పది రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఇంకా ముంపులోనే నరకయాతన అనుభవిస్తున్నారు. అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రగోదావరి.... జిల్లాను పూర్తిగా ముంచేసింది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ బృందం వరద బాధిత గ్రామాల్లో పర్యటించింది. పోచమ్మ గండి నుంచి లాంచీలో బయలుదేరి దేవీపట్నం చేరుకున్నారు. అక్కడ కొండపై ఉన్న పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. దేవీపట్నం గ్రామంలో బోట్లపై ప్రయాణించిన లోకేష్... వరద బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు లోకేష్.
Next Story