ఆంధ్రప్రదేశ్

ఈ సారి సాగుకు ఢోకా లేదు

ఈ సారి సాగుకు ఢోకా లేదు
X

కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తెలుగురాష్ట్రాల్లో ప్రాజెక్టలు జలకళను సంతరించుకున్నాయి. నాగార్జున జలాశయం నిండుకుండలా మారింది. దీంతో సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతుల మోహాల్లో ఆనందం వెల్లువిసిరింది. ఈసారి ఖరీఫ్‌ సాగుకు నీటి కొరత ఉండదని సంబర పడిపోయారు. ఆరుతడి, మాగాని పంటకు కృష్ణమ్మ పారుతుందుని సంతోషం వ్యక్తం చేశారు. వానాకాల పంటకు కాస్త లేట్‌ అయినా ఏరువాకకు సిద్ధమైయ్యారు. కానీ రైతన్న ఆశలకు అధికారులు గండీ కొట్టారు. సాగర్‌ కుడికాలువ ఆయకట్టులో వరి సాగుకు నీరివ్వలేమని అధికారులు ప్రకటించారు. కేవలం అరుతడికి మాత్రమే సాగర్‌ జలాలను అందిస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి..మాగాణికి నీరందించే ప్రయత్నం చేస్తామని సమీక్షా సమావేశంలో మంత్రులు పేర్కొనడం కొసమెరుపు.

ప్రకాశం జిల్లాలో సాగర్‌ కుడికాలువ కింద 4లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగైదు సంవత్సరాలుగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల పంటల సాగుకు పూర్తిస్థాయిలో నీరివ్వలేకపోయారు. జిల్లాలో తాగునీటి సమస్య నివారణకే ఎక్కువగా సాగర్‌ నీటిని వినియోగించారు. ఈ ఏడాది శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులకు పుష్కలంగా నీరు వచ్చి చేరడం.. తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణంతో ఈసారి పంటల సాగుకు ఢోకా ఎండదని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. కుడికాలువకు నీటిని కూడా విడుదల చేశారు. కానీ ఇక్కడే తిరకాసు పెట్టారు. సాగర్‌ నీటి అంశంపై ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఆదిమూలపు సురేష్‌ అధికారులతో సమీక్ష జరిపారు. అనేక తర్జన, భర్జనల అనంతరం సాగర్‌ కుడికాలువ ఆయకట్టులో ఆరుతడికి తప్పా,,మాగాణికి నీరు ఇవ్వలేమని కలెక్టర్ తేల్చిచెప్పారు. జిల్లాలో సాగు, తాగునీరుకు 52 టీఎంసీల కేటాయింపు ఉందని..వీటిలో సాగుకు 40 టీఎంసీలు, తాగుకు11 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉందన్నారు. గత కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయంపై సాగర్‌ కుడికాలువ ఆయకట్టు రైతులు తీవ్రంగా మండిపడ్డుతున్నారు. గత ఏడాది నీరివ్వకనే తీవ్రంగా నష్టపోయామని..ఈసారి శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల్లో పుష్కలంగా జలాలు అందుబాటులో ఉన్నా..వరిపంటకు పూర్తిస్తాయిలో నీరివ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా వరుస కరవులతో పంటల దిగుబడి లేక అప్పుల ఊబిలో చిక్కుకున్నామని వాపోతున్నారు. పంటలపై ఆంక్షలు పెట్టుకుంటా వరసాగుకు కూడా నీరివ్వాలని కోరుతున్నారు.

Next Story

RELATED STORIES