తొలి టెస్టులో నిరాశపరిచిన కోహ్లి.. ఆ అవకాశాన్ని చేజార్చుకున్న రోహిత్!

సౌతాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 502 రన్స్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.202 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ 317 పరుగుల వద్ద రోహిత్ వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పుజారా, కోహ్లి, రహానే, హనుమ విహారి నిరాశపరిచారు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్కోరును పెంచే క్రమంలో పెవిలియన్ చేరాడు. 30 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజా ఆకట్టుకున్నాడు. 500 రన్స్ దాటిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేద్దామంటూ కోహ్లి ముందుగానే సంకేతాలివ్వడంతో దాన్నే లక్ష్యంగా చేసుకుని విహారి, జడేజా, సాహాలు బ్యాట్ ఝుళింపించే యత్నం చేశారు. ఈ క్రమంలో విహారి విఫలం కాగా, జడేజా, సాహాలు ఫర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు సాధించగా, ఫిలిండర్, డేన్ పీడ్త్, ముత్తుస్వామి, డీన్ ఎల్గర్‌లు తలో వికెట్ తీశారు.
రెండో రోజు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆటే హైలెట్. ఆడేది కేవలం ఐదో టెస్టే అయినా..ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓపిగ్గా ఆడటమే కాదు.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీల మోత మోగించాడు. సెంచరీపూర్తయిన తర్వాత మరింత దూకుడు పెంచాడు మయాంక్ . 215 రన్స్ చేసిన తర్వాతఎల్గర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇందులో 23 ఫోర్లు, 6 సిక్లర్లు ఉన్నాయి. మయాంక్ కెరీర్‌లో ఇదే అత్యత్తమ స్కోరు.
దక్షిణాఫ్రికాపై ఇద్దరు టీమిండియా ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అయితేరోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 176 రన్స్ చేసి ఔటయ్యాడు. ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించిన తొలి టెస్టులోనే డబుల్ సెంచరీ సాధిస్తాడనుకున్నప్పటికీ ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
Also watch :
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com