అంతర్జాతీయం

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి
X

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువకుడిపాటు మరో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. టెన్నసీ స్టేట్ యూనివర్సిటీలో వీరిద్దరూ చదువుతున్నారు. వీళ్లు బైక్‌పై వెళ్తున్న సమయంలో ఓ ట్రక్ ఢీకొట్టింది. సౌత్‌ నాష్‌విల్లేలో జరిగిన యాక్సిడెంట్‌లో స్పాట్‌లోనే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తెలుగువిద్యార్థి వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు. ఆ యువతిని స్టాన్లీగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నవంబర్ 28న జరిగిన ఈ హిట్ అండ్ రన్ కేసులో ట్రక్ డ్రైవర్‌ డేవిడ్ టోరస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల్ని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి కొంచెం సమయం పట్టింది. ప్రస్తుతం డెడ్‌బాడీలు స్వస్థలాలకు పంపించేందుకు TSU విద్యార్థులు ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టారు.

Next Story

RELATED STORIES