ఇస్రో ది గ్రేట్.. శాటిలైట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

ఇస్రో ది గ్రేట్.. శాటిలైట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

isro

ఇస్రో ది గ్రేట్...! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చరిత్రలో మరో కలికితురాయి. రీశాట్‌–2BR-1 శాటిలైట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. నిప్పులు చిమ్ముకుంటా నింగిలోకి దూసుకెళ్లిన PSLV-సీ-48 వాహక నౌక 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. సరిగ్గా 3 గంటల 25 నిమిషాలకు నింగిలోకి దూసుకుపోయిన రాకెట్..576 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి రీశాట్‌–2BR-1 ఉపగ్రహాన్ని చేర్చింది.

PSLV సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2BR-1 ఉపగ్రహంతోపాటు అమెరికా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌కు చెందిన 9 శాటిలైట్లను కూడా సక్సెస్‌ఫుల్‌గా సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు. ఇది ఇస్రోకు ఓ ల్యాండ్ మార్క్ ప్రయోగం. ఎందుకంటే.. షార్‌ ఏర్పాటైనప్పటి నుంచి 49 PSLV ప్రయోగాలు చేపట్టారు. ఇప్పుడు ప్రయోగించిన PSLV సీ–48 రాకెట్ 50వది.

Tags

Read MoreRead Less
Next Story