వెంకీ మామ రివ్యూ

వెంకీ మామ రివ్యూ

venky-mama-review

టైటిల్‌: వెంకీ మామ

జానర్‌: ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

నటీనటులు : వెంకటేశ్‌, నాగచైతన్య, రాశి ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌, నాజర్‌, రావు రమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, తదితరులు

మ్యూజిక్ : థమన్‌

సినిమాటోగ్రఫి: ప్రసాద్‌ మురేళ్ల

దర్శకత్వం: బాబీ

నిర్మాతలు: సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌

విక్టరీ ని ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఫ్యామిలీస్ ఇమేజ్ ఇంకా చెక్కుచెదరలేదని ఎఫ్ 2 నిరూపించింది. అదే జోరులో అదే బాటలో మేనల్లుడు నాగచైతన్య తో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని ఈ ఇయర్ ఎండింగ్ కి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. మరి ఈ రియల్ మామా అల్లుళ్ళు రీల్ మీద ఆడిన ఆట ఎంత రక్తి కట్టిందో చూద్దాం..

venky-mama

కథ:

వెంకటరత్నం (వెంకటేష్) ఇంట్లో పెద్దలు కాదన్నా, చెల్లెలుకి ప్రేమ వివాహాం చేస్తాడు. జాతకాల మీద విపరీతమైన నమ్మకం ఉన్న వెంకటరత్నం తండ్రి (నాజర్ ) వారి జాతకాలు కలవలేదని ఇంట్లోకి రానివ్వడు. ఆయన ఊహించిన విధంగానే వారు యేడాదిలోపు యక్సిడెంట్ లో చనిపోతారు. అనాథగా మిగిలిన కార్తిక్ ( నాగచైతన్య) ను అన్నీ తానే అవుతాడు వెంకటరత్నం. కార్తిక్ అంటే పడని తాత అతడ్ని ఇంట్లో నుండి బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంటాడు. తనకోసం ఒంటరిగా మిగిలిన మామ పెళ్ళికోసం అల్లుడు ప్రయత్నిస్తుంటే తన కారణంగా దూరం అయిన అల్లుడు ప్రేమను కలపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తుంటాడు. ఒకసారి కార్తిక్ మామ మీద కోపంతో ఇల్లు వదిలి పెట్టి వెళతాడు. కార్తిక్ ఇల్లు వదిలి వెళ్ళి పోవడానికి కారణం ఎవరు...? ఎందుకు మామా అల్లుళ్ళ మద్య గ్యాప్ వస్తుంది..? తిరిగి వారు కలిసారా లేదా అనేది మిగిలిన కథ..?

123.png

కథనం:

వెంకీ మామ టైటిల్ కి తగ్గట్టుగానే ఇది వెంకీ సినిమా గా మిగిలిపోతుంది. ఎవరి పాత్రలు బాగున్నా వెంకీ ఇమేజ్ ముందు వాళ్లు పెద్దగా ఎలివేట్ అవ్వలేదు. నాగచైతన్య మాత్రం మామకు తగ్గ అల్లుడుగా మారిపోయాడు. ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ ని అంతే బాగా తెరమీదకు తెచ్చాడు. మామ, అల్లుళ్ళ ప్రేమలు, వారి అల్లర్లు మాత్రం ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేసాయి. సినిమా లో వెంకీ ఇంట్రడక్షన్ సీన్ లోనే సినిమా ఎలాంటి ఎమోషన్ తో వెళుతుందో దర్శకుడు బాబీ చెప్పేసాడు. ఆ తర్వాత కొంత ఫన్ యాడ్ అవ్వచ్చు. పాటలలో కాస్త ఊపు రావొచ్చు కానీ బేసిగ్గా కనెక్ట్ అయిన ఎమోషన్ ని వదలకుండా, ఎక్కడా చెడకుండా కథను బాగా పండించాడు దర్శకుడు బాబి. ‘అమ్మయినా, నాన్నయినా నువ్వేలే వెంకీ మామ’ పాట ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ లో కనపడుతుంది ఎలివేట్ చేస్తుంది. వెంకటరత్నంగా వెంకటేష్ నటన చాలా బాగుంది. బాగా చేయి తిరిగిన ఆటను అలవోకనా నడిపాడు వెంకటేష్.

venky-mama

రాశీ, పాయిల్ కాంబినేషన్ లో వెంకటేష్ సీన్స్ చాలా సరదాగా సాగాయి. సంగం హిందీ సంగం తెలుగుతో పాయల్ చేసిన కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవలేదు. కానీ మామ అల్లుళ్ళ మద్యరాసుకున్నకథలో మలుపులు చాలా బలంగా ఉన్నాయి. మామ అల్లుళ్ళ కథలో ఎక్కడా బిగి తగ్గకుండా సెంటిమెంట్ తో పాటు లాజిక్ మిస్ అవ్వకుండా చేసాడు దర్శకుడు. జాతకాల మీద విపరీతమైన నమ్మకం ఉన్న కుటుంబంలో ఆ జాతకాలకు ఎదురు వెళ్లే మామ అల్లుళ్ళ ప్రేమ ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. కన్నీళ్లు పెడుతుంది, బాగా నవ్విస్తుంది. నాగచైతన్య, వెంకి మద్యల సెంటిమెంట్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. నాగచైతన్యను లండన్ కి తీసుకెళ్ళడానికి వచ్చిన తాతయ్య, నాయనమ్మ సన్నివేశం చాలా బాగా డీల్ చేసాడు దర్శకుడు. ఒక రిలేషన్ గురించి తెలియాలంటే దానికోసం ‘ఏం చేస్తావో కాదో ఏం వదలు కుంటావో ’ అన్నది డిసైడ్ చేస్తుంది. లాంటి మాటలు చాలా టచ్చింగ్ గా ఉన్నాయి. సెంకడాఫ్ కొచ్చేసరికి కథ కొంచెం మిలటరీ బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళింది. సరదాగా కోనసీమ పంట పోల్లాల్లో నడుస్తున్న కథ కాస్తా కొత్త బ్యాక్ డ్రాప్ లోకి అడెజ్ట్ అవడానికి కాస్తా టైం పట్టింది. మిలటరీ బ్యాక్ డ్రాప్ ఒకసీరియస్ కాన్సెప్ట్ ని ఎమోషనల్ స్టోరీ లోకి తీసుకెళ్ళి పోవడం కాస్త రిస్క్ అయినా ఆ రిస్క్ ని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసింది వెంకీ మామ టీం. నాగచైతన్య, వెంకటేష్ కాంబినేషనల్ లో వచ్చిన వెంకీ మామ ఆడియన్స్ కి అందమైన మామ అల్లుళ్ళ కథలా గుర్తుండిపోతుంది.

చివరిగా:

అంతా వెంకీ మామే..

Tags

Read MoreRead Less
Next Story