ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు పోలవరంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యటన

శనివారం నుంచి 3 రోజులపాటు కేంద్ర నిపుణుల కమిటీ పోలవరంలో పర్యటించనుంది. ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కుడి, ఎడమ కాలువల పనులను హెచ్.కె.హల్దార్ బృందం పరిశీలించనుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో ఎడమ కాలువ పనులను, రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో జలాశయం పనుల్ని నిపుణుల కమిటీ పరిశీలించనుంది. అటు సోమవారం కుడికాల్వ పనుల్ని పరిశీలించి అనంతరం విజయవాడలో రాష్ట్ర జలవనరుల శాఖతో సమీక్ష సమావేశం నిర్వహించనుంది. జనవరి 2న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌కు హల్దార్ బృందం నివేదిక ఇవ్వనుంది.
Next Story