అమరావతి ఉద్యమంలో విషాదం.. గుండెపోటుతో రైతు మృతి

అమరావతి ఉద్యమంలో విషాదం చోటు చేసుకుంది. రాజధానిని తరలిస్తారని తీవ్ర ఆవేదనకు గురైన దొండపాడు రైతు కొమ్మినేని మల్లికార్జునరావు.. గుండెపోటుతో మృతి చెందాడు. 17 రోజులుగా ఆయన రాజధాని అమరావతి కోసం ఉద్యమం చేస్తున్నాడు. నిన్న ఏలూరులో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి.. మూడు రాజధానులు ఉంటాయనే సంకేతాలు ఇవ్వడం.. ప్రభుత్వానికి బోస్టన్‌ గ్రూపు నివేదిక ఇవ్వడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్టు తోటి రైతులు చెప్తున్నారు. దీంతో.. ఆయన గుండెపోటుకు గురైనట్టు చెప్తున్నారు. మల్లికార్జునరావు మరణానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని అంటున్నారు. ఇప్పటికైనా.. సీఎం జగన్ మనసు మార్చుకోవాలని.. కక్ష సాధింపులు మానుకుని... అమరావతిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags

Next Story