విడిపోతున్నాం.. ఇదిగో 'విడాకుల' ఆహ్వాన పత్రం.. నయా ట్రెండ్‌కి నాంది

విడిపోతున్నాం.. ఇదిగో విడాకుల ఆహ్వాన పత్రం.. నయా ట్రెండ్‌కి నాంది

divorce-card

ఏం పెళ్లి చేసుకుంటేనే అందర్నీ పిలవాలా.. విడిపోతే పిలవకూడదా ఏంటి. మా ఇష్టా ఇష్టాలతో ప్రమేయం లేకుండా మీకు నచ్చిన వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అతడు నచ్చక, సర్ధుకుపోలేక, సంసారం చేయలేక విడాకులు తీసుకుంటున్నాం. పెళ్ళైతే అందరి సమక్షంలో చేసుకోవాలి. విడాకులు మాత్రం అందరి సమక్షంలో ఎందుకు తీసుకోకూడదు. ఇది కూడా ఒక పండగ లాంటిదే.

ఇష్టం లేని వ్యక్తికి విడాకులు ఇస్తే ఆమెకు స్వేచ్చ వచ్చినట్లే కదా. ఆ తరువాత ఆమెకు ప్రతి రోజూ పండగే. మరి అలాంటప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పేం ఉంది. అందుకే ఈ విడాకుల ఆహ్వాన పత్రిక అంటూ ఓ సరికొత్త ఆహ్వాన కార్డును రూపొందించింది పాకిస్తాన్ ఆర్టిస్ట్ నిర్మాత కూడా అయిన కోమల్ ఆష్.

పెళ్లి శుభలేఖలకు పేరడీగా ఈ డివోర్స్ కార్డును తయారు చేసింది. ఇందులో ఓ వివాహిత విడాకుల వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న చిత్రం ఉంది. దానిపై విడాకుల కార్యక్రమానికి నా సాదర ఆహ్వానం అని రాసి ఉంది. అందులో ఆమె గుండెను చేతితో పిండేస్తున్నట్లు ఉంది. పాకిస్థాన్ మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను ఎత్తి చూపేందుకే కోమల్ ఈ మార్గాన్ని ఎంచుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ డివోర్స్ కార్డు ఇప్పుడు వైరల్ అయింది. ఈ సందర్భంగా కోమల్ మాట్లాడుతూ పెద్దలు తమకు నచ్చిన వ్యక్తిని తీసుకువచ్చి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అతడు మంచి వాడైతే మంచిదే. కానీ వేధించే వాడైతే ఆమె నరకం అనుభవిస్తుంది. అందులోనుంచి బయటపడే మహిళకు విడాకులు నిజంగానే ఓ వరం. ఆ రోజు ఓ పండుగ లాంటిది. వేడుక చేసుకోవడంలో తప్పు లేదు అని కోమల్ తెలిపింది.

Read MoreRead Less
Next Story