10 Jan 2020 5:25 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / రాజధాని గ్రామాల్లో...

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఏడుగురు రైతుల అరెస్ట్‌

రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు.. ఏడుగురు రైతుల అరెస్ట్‌
X

amaravati

అమరావతి ప్రాంతంలోని రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అరెస్ట్‌లతో పోలీసులు.. భయందోళనలు సృష్టిస్తున్నారు. నిన్న రాత్రి తుళ్లూరులో ఏడుగురు రైతుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. వీరిని నరసరావుపేటకు తరలించారు. అటు ఈ తెల్లవారుజాము నెక్కల్లులోనూ పోలీసులు హల్‌చల్‌ చేశారు. పదిమంది రైతులకు నోటీసులిచ్చారు. దీంతో రాజధాని రైతులు, మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఇక అటు నిరసనలకు అనుమతి లేదంటూ... 29 గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎవరూ ఆందోళనల్లో పాల్గొనవద్దంటూ హెచ్చరించారు. మందడంలో భారీ ఎత్తున కవాతు నిర్వహించారు.

Next Story