ముఖ్యమంత్రి అరాచకాలకు పాల్పడుతున్నారు : కన్నా లక్ష్మీనారాయణ

ముఖ్యమంత్రి అరాచకాలకు పాల్పడుతున్నారు : కన్నా లక్ష్మీనారాయణ

kanna

ఏపీ రాజధాని తరలింపు కుట్ర పూరిత చర్యగా బీజేపీ అభివర్ణించింది. సీఎం జగన్‌ ఆఫీసులు మార్చినట్టు.. కేపిటల్‌ మార్చడం సరికాదని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో బీజేపీ కోర్‌ కమిటీ సమావేశంలో.. రాజధానికి సంబంధించి కొన్ని కీలక తీర్మానాలు చేశారు. వికేంద్రీకరణ ముసుగులో ముఖ్యమంత్రి అరాచకాలకు పాల్పడుతున్నారని కన్నా విమర్శించారు. అమరావతి కేవలం రైతుల సమస్య మాత్రమే కాదని... రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమని అన్నారాయన.

అమరావతిలోనే రాజధాని కొనసాగాలని బీజేపీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రులు మారినప్పుడు కేపిటల్ మార్చాలనుకోవడం సరికాదని ఆ పార్టీ నేతలు వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలను తమ పార్టీ ఖండిస్తుందని అన్నారు. అమరావతిపై ఈనెల 17 తర్వాత కార్యాచరణ ప్రకటించనున్నారు.

Tags

Next Story