టెన్త్ విద్యార్ధులకు స్టడీ అవర్స్.. విద్యార్థులకు దిల్ పసంద్, జిలేబీ, సమోసా సప్లై

టెన్త్ విద్యార్ధులకు స్టడీ అవర్స్.. విద్యార్థులకు దిల్ పసంద్, జిలేబీ, సమోసా సప్లై

snacks

పది పబ్లిక్ పరీక్షలు వచ్చేస్తున్నాయి. విద్యార్థులు బాగా చదివితే మంచి మార్కులు వస్తాయి. స్కూల్ రిజల్ట్ బావుంటుందనే మంచి ఉద్దేశంతో ఏపీ సర్కారు సంక్షేమ హాస్టల్స్‌లో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు

స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. గత సంవత్సరం నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈ ఏడాది కూడా మరింత శ్రద్దతో వీటిని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

సంక్రాంతి సెలవులు పూర్తయిన అనంతరం వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ శాఖలు స్టడీ అవర్స్ ప్రారంభించనున్నాయి. తరగతులు పూర్తయిన తరువాత హాస్టల్‌కి వచ్చిన విద్యార్ధులకు రాత్రి 8 నుంచి

11 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. ప్రతి 45 నిమిషాలకు ఒక సబ్జెక్ట్ చొప్పున 4 సబ్జెక్టులపై స్టడీ జరుగుతుంది. విద్యార్థులకు వచ్చే సందేహాలను తీర్చడానికి స్థానికంగా ఉన్న యువకులను, విశ్రాంత ఉపాధ్యాయులు, సేవా దృక్పథం ఉన్న ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేయాలని అధికారులు నిర్ణయించారు.

దాదాపు 3 గంటలు పైగా సాగే స్టడీ అవర్‌ విద్యార్థులకు అదనపు శక్తి కోసం స్నాక్స్ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఒక్కో విద్యార్థికి రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చు పెడుతున్నారు స్నాక్స్ నిమిత్తంగా. విద్యార్ధులకు టీతో పాటు స్నాక్స్ కింద దిల్ పసంద్, సమోసా, జిలేబీ, మిర్చి, ఎగ్‌పఫ్, కర్రీపఫ్ పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది నూటికి నూరు శాతం ఫలితాలు తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది విద్యాశాఖ.

Read MoreRead Less
Next Story