24 Jan 2020 12:13 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / శాసన మండలి రద్దు దిశగా...

శాసన మండలి రద్దు దిశగా సీఎం అడుగులు.. 27న ఏపీ క్యాబినెట్ లో తీర్మానం?

శాసన మండలి రద్దు దిశగా సీఎం అడుగులు.. 27న ఏపీ క్యాబినెట్ లో తీర్మానం?
X

శాసన మండలి రద్దు దిశగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈనెల 27న ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మండలిని రద్దు చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది.

అమరావతి తరలింపు, crda ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం జగన్ మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ మండలిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీని సమావేశపరచి మండలిని కొనసాగాలా లేదా అనే అంశంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు.

Next Story