అంతర్జాతీయం

మూడు రాజధానుల విషయంలో జగన్‌ సర్కారు తప్పు చేస్తోంది : దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలు

మూడు రాజధానుల విషయంలో జగన్‌ సర్కారు తప్పు చేస్తోంది : దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలు
X

ఒకే చోట కేంద్రీకృతమైన కేంద్ర కార్యాలయాలతో కాలం కలిసి వస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు రాజధాని నగరాలు అభివృద్ధి చెందుతాయి. అలాగని అభివృద్ధి చెందే నగరాలన్ని రాజధాని నగరాలు కావాల్సిన అవసరం లేదు. కొన్ని సిటీస్ కేపిటల్ సిటీస్ కంటే మూడు నాలుగు రెట్లు అభివృద్ధి అవటం మనకు తెలిసిందే. బహుళ రాజధాని వ్యవస్థ ఉన్న సౌతాఫ్రికా కేస్ స్టడీలో ఇదే విషయం మరోసారి రుజువు అవుతోంది. సౌతాఫ్రికా లెజిస్లేటీవ్ కేపిటల్ కేప్ టౌన్ అభివృద్దికి రాజధాని అనే గుర్తింపే అవసరం లేదు. సముద్ర తీర నగరమైన కేప్ టౌన్ స్వతహాగానే అభివృద్ధి చెందిన నగరం. అదే తరహాలో ఏపీలోని విశాఖకు కూడా రాజధాని అనే గుర్తింపు అవసరం లేదు. పర్యాటక ప్రాంతంగా, ఐటీ సిటీగా, ఇండస్ట్రియల్ ప్లేస్ గా విశాఖకు స్వతహాగానే అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కేప్ టౌన్ నుంచి పార్లమెంట్ ను తరలించాలని సౌతాఫ్రికా భావిస్తుంటే అదే స్వరూపం ఉన్న విశాఖకు పరిపాలనా కార్యాలయాలు తరలించాలన్న ప్రభుత్వం తీరు విమర్శలకు తావిస్తోంది.

దక్షిణాఫ్రికాలోని రాజధాని వ్యవస్థలోని లోపాలను.. దీనివల్ల అక్కడి ప్రజలు, ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ... జగన్‌ సర్కారు వేస్తున్న అడుగు తప్పని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంది టీవీ5. ప్రతినిత్యం ప్రజల కోణంలో, రైతుల కోణంలో ఆలోచించే టీవీ5.. 3 రాజధానుల విషయంలోనూ ప్రభుత్వ తప్పొప్పులను నిరూపించేందుకు టీవీ 5 సిద్ధమైంది. ఇదే లక్ష్యంతో సౌతాఫ్రికాలో పర్యటిస్తున్న మా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మూర్తి.. ఇప్పటికే పరిపాలన రాజధాని ప్రిటోరియాలో.. రెండో రోజు న్యాయరాజధాని బ్లూమ్‌ ఫౌంటేన్‌లో పర్యటించారు. ఆ తర్వాత శాసన రాజధాని కేప్‌టౌన్‌లో పర్యటించారు. ఇక కేప్ టౌన్ నుంచి మిడ్ రాండ్ కు చేరుకున్నారు. ఇక్కడి వారి మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని నినాదంతో సమావేశమైన ఎన్ఆర్ఐలు జగన్ ప్రభుత్వ నిర్నయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. అసలు ఏ కోణంలో సౌతాఫ్రికా ఫార్ములాను ఏపీకి అన్వయించారని ప్రశ్నిస్తున్నారు.

ఏడాదికి 60 కోట్ల ఖర్చుకే మండలిని రద్దు చేయాలని ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వం..ఇప్పటికే నిర్మాణాలను పూర్తి చేసుకుని అన్ని అనుమతులు పొందిన హైకోర్టును ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు విశాఖ టూ అమరావతికి చట్టసభల ప్రతినిధులు, వారి సిబ్బంది, అధికారుల జర్నీ ఖర్చును ఎవరు భరిస్తారు? అది మాత్రం ఖర్చు కాదా ? అని ప్రశ్నిస్తున్నారు.

ఏపీ విషయంలో కేంద్రం తీరును కూడా ఎన్ఆర్ఐలు తప్పుబడుతున్నారు. ఎంతసేపు ఎన్నార్సీ, సీఏఏలేనా అమరావతి విషయాన్ని కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు.

రాజధానిని నిర్మంచుకోవాలంటే ప్రకృతి విపత్తులు లేని ప్రాంతాల వైపే మొగ్గు చూపుతారు. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రకృతి విపత్తులకు ఎక్కువ అస్కారం ఉన్న విశాఖను ఎందుకు ఎంచుకుందని అంటున్నారు.

ఇక సౌతాఫ్రికాతో ఏపీని అన్వయించుకోవటమే సరికాదని అంటున్నారు. దక్షిణాఫ్రికా దేశం.. ఏపీ రాష్ట్రం. ఈ రెండు ప్రాంతాల్లో ఒకే తరహా రాజధానుల వ్యవస్థ ఏర్పాటు ఎలా ఎంచుకుంటారిని నిలదీస్తున్నారు.

Next Story

RELATED STORIES