98 ఏళ్ల వయసులో కూడా సేవా కార్యక్రమాలు.. విరాళాలు
కెమికల్ ఇంజనీర్ వెల్లంకి రామారావు 98 ఏళ్ల వయసులోనూ అనేక సేవా కార్యక్రమాలతో ధాతృత్వం చాటుకుంటున్నారు. రాజమండ్రిలోని గౌతమి కారుణ్య సంఘంలో భవనాలు పాడైపోయి.. శిథిలావస్థకు చేరడంతో అక్కడి వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను గుర్తించి జవహర్ వాకర్స్ క్లబ్ నిర్మించిన వసతి గృహానికి.. వెల్లంకి రామారావు ఆర్థిక సహాయం చేశారు. తన భార్య.. స్వర్గీయ సరోజనీ దేవి జ్ఞాపకార్థం.. గౌతమీ జీవ కారుణ్య సంఘంలో వృద్ధులు, అనాథలకు బాసటగా నిలిచేందుకు సుమారు 50 లక్షల వ్యయంతో అత్యాధునిక హంగులతో రెండు వసతి గృహాలను నిర్మించారు.
అల్లుడు డాక్టర్ రాధాకృష్ణ, శ్రీమతి వేదమణి దంపతుల సమక్షంలో.. రామకృష్ణ మఠం స్వామిజీ వినిశ్చాలనంద నిత్యానందగిరి చేతులు మీదుగా.. ఈ రెండు వసతి గృహాలను ప్రారంభించారు. తద్వారా.. వృద్ధులు, అనాథలకు ఆశ్రయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖలతో పాటు జీవకారుణ్యం సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com