సీఎం జగన్‌ మనసు మారాలని దేవుళ్లకు మొక్కుతున్న రైతులు

సీఎం జగన్‌ మనసు మారాలని దేవుళ్లకు మొక్కుతున్న రైతులు

అమరావతి ఉద్యమం మహోగ్రంగా సాగుతోంది. అలుపెరగకుండా అన్నదాతలు చేస్తున్న పోరాటానికి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. 42వ రోజు నిరసనలు హోరెత్తాయి. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం సహా.. రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేస్తున్నారు.

రాయపూడిలో రైతులు జల దీక్ష చేపట్టారు. వృద్ధులు, మహిళలు అని తేడా లేకుండా అంతా నీటిలోకి దిగారు. సేవ్‌ అమరావతి అంటూ నినదాలు చేశారు.

అమరావతి కోసం రైతులు, మహిళలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు.. ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని, సీఎం జగన్‌ మనసు మారాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. ఉద్దండరాయునిపాలెంలో 108 సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు.

అమరావతి కోసం బెజవాడలో మహిళలు కదం తొక్కారు. అమరావతి పరిరక్షణ సమతి ఆధ్వర్యంలో కరెన్సీనగర్ ఆంజనేయస్వామి గుడి నుంచి... APIIC కాలనీవరకు భారీ ర్యాలీ చేపట్టారు..ల్యాండ్‌ పూలింగ్‌ తాము వ్యతిరేకమన్న సీఎం జగన్.. మరి విశాఖలో ఎందుకు జీవో ఇచ్చారని నిలదీశారు మహిళలు

శాసనమండలి రద్దును నిరసిస్తూ జేఏసీ పిలుపు మేరకు మైలవరపట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అమరావతి జేేేఏసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. అటు పెడనలోనూ బైక్ ర్యాలీ నిర్వహించారు.

శాసన మండలి రద్దును వ్యతిరేకిస్తూ మందడంలో నల్లబెలూన్స్‌ను వదలి నిరసన తెలిపారు రాజధాని రైతులు.వికేంద్రీకరణ బిల్లులను మండలి సెలెక్ట్‌ కమిటీకి పంపడంతో.. ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పాట్..బైట్

రాజధాని రైతులకు మద్దతుగా.. వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి అమరావతికి తరలివస్తున్నారు ప్రజలు. మందడంలో దీక్షకు ఎన్నారైలు సైతం సంఘీభావం తెలిపారు. నిధులు సమకూర్చడం ద్వారా ఉద్యమానికి తమ వంతు సాయం చేస్తామని చెప్పారు.

అమరావతి కోసం పోరాటం చేసిన మరో గుండె అలిసిపోయింది. మంగళగిరి మండలం నవులూరుకు చెందిన టీడీపీ నాయకుడు రంగిశెట్టి వెంకటేశ్వర్‌రావు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. వెంకటేశ్వర్‌రావుకుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారాయన. ఇద్దరు పిల్లల చదువులకు పార్టీ తరఫున సహాయం అందిస్తామని లోకేష్‌ చెప్పారు.

అమరావతి మార్పును వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు, ప్రజాసంఘాల నాయకులు రోడ్డెక్కారు. అనంతపురంలో నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story