ఆంధ్రప్రదేశ్

అమరావతి రైతులకు పెరుగుతున్న మద్దతు

అమరావతి రైతులకు పెరుగుతున్న మద్దతు
X

అమరావతే రాజధానిగా ఉండాలంటూ ఉద్యమం ఉధృతరూపం దాల్చుతోంది. 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. వారికి మద్దతుగా సమీప గ్రామాలకు చెందిన రైతులు సైతం సంఘీభావం తెలిపారు. శాసనమండలి రద్దు నిర్ణయానికి నిరసనగా పెదపరిమిలో మహిళలు నిరసన తెలిపారు. అటు.. అమరావతే రాజధానిగా ఉండాలని రాజధాని రైతులే కాదు.. పొరుగు జిల్లాల రైతులు, మహిళలు నినదిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మహిళలు అమరావతికి వచ్చి సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులకు మద్దతుగా.. తెలంగాణ రైతులు కూడా గొంతు కలుపుతున్నారు. రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తోన్న అమరావతి రైతులకు తెలంగాణ రైతులు సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 250 మంది రైతులు మందడం వచ్చారు. మార్గ మధ్యంలో కంచికచర్లలో ఆగిన ఖమ్మం రైతులు అక్కడ దీక్షలో కూర్చున్న వారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES