జగన్.. సీఎం అయితే పెట్టుబడులు వెనక్కి పోతాయని నిరూపించారు: పవన్

జగన్.. సీఎం అయితే పెట్టుబడులు వెనక్కి పోతాయని నిరూపించారు: పవన్

సుగాలి ప్రీతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కర్నూలులో ర్యాలీ నిర్వహించారు పవన్‌ కల్యాణ్‌. రాజ్‌విహార్‌ సర్కిల్‌ నుంచి కోట్ల కూడలి వరకు ర్యాలీ చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తానే తీసుకెళ్తానన్నారు పవన్‌.

కర్నూల్ లో జ్యూడిషియల్ క్యాపిటల్ పెడ్తామమంటున్న జగన్ సర్కారు. ప్రీతి కేసులో ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రీతికి న్యాయం చేకపోతే.. కర్నూలులో న్యాయరాజధాని పెట్టినా వృథానేనన్నారు. దిశా గురించి మాట్లాడిన జగన్ రెడ్డి.. ప్రీతి విషయంలో ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు.

అంతకు ముందు ప్రీతిబాయి తల్లి పార్వతీబాయి మాట్లాడింది. తన కూతురుని దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని అనేక మందిని కలిసినా.. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే తన బాధ అర్థం చేసుకున్నారన్నారు.

జగన్‌ సీఎం అయితే రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కి పోతాయని నిరూపించారన్నారు. హంద్రీనీవా పైప్‌ లెన్‌ వెళ్తున్నా కర్నూలు ప్రజలు నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారన్నారు. సీఏఏ, ఎన్నార్సీపై కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు దుష్ర్పచారం చేస్తున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story